డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైలెంట్గా సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారా ? జనసేన 11వ ఆవిర్భావ సభలో ఈ విషయం ఆయన చెప్పగానే చెప్పేశారా ? పవర్ స్టార్ కు ఓజీ లాస్ట్ మూవీ కాబోతుందా ? ఉస్తాద్ భగత్ సింగ్‌పై సైతం అభిమానులు ఆస‌లు వదులుకోవాల్సిందేనా ? ఒకవేళ ఇదే నిజమైతే అఖీరా నందన్ ఎంట్రీకి సమయం వచ్చినట్లేనా ? వీటన్నిటి పై ఈ స్టోరీలో చూద్దాం .. పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా ఆయ‌న‌ నుంచి సినిమాలు రావాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు .  ఏడాదికో సినిమా ఏం అవసరం లేదు .. ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని వారు కోరుకుంటున్నారు . అందుకే ఆయన ఎక్కడ కనిపించిన ఓజి , ఓజి అంటూ అభిమానులు అరుస్తున్నారు ..


దీంతో పాటు హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల‌కు కూడా కమిట్ అయ్యారు డిప్యూటీ సీఎం .. నిజానికి అజ్ఞాతవాసి తర్వాతే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ . అలా నాలుగేళ్ల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ అంటూ మరోసారి ఇండస్ట్రీ లోకి వచ్చారు .. ఆ తర్వాత భీమ్లా నాయక్ , బ్రో సినిమాలు అతి తక్కువ గ్యాప్ లోనే కంప్లీట్ చేశారు .  అదే సమయంలో ఉస్తాద్‌ పాటు వీరమల్లు,  ఓజీకి కూడా ఒకే చెప్పారు .. ఇక ఇందులో ఓజీ షూట్ చివరి దశకు వచ్చింది .. మరో రెండు వారాలు డేట్స్ ఇస్తే సినిమా అయిపోతుంది . ఇక హరిహర వీరమల్లు మే 9న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్‌ ప్రకటించారు .. ఆ వెంటనే కాస్త సమయం చూసుకుని ఓజికి కూడా డేట్స్ ఇస్తా అంటున్నారు పవన్ ..


 ఇక ఈ రెండు పూర్తయ్యాక ఉస్తాద్ రావటం పై కొంత అనుమానమే .. పవన్ ఉన్న బిజీకీ ఈ సినిమా పూర్తి చేయడం కష్టమే .. పైగా పవన్ కు సినిమాలు పై ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేదనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది . ఇలా పవన్ చేస్తున్న పనులు ఆయన చెబుతున్న దాన్ని బట్టి ఓజీ ఆయనకు లాస్ట్ సినిమా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు .. అంటే  అకీరా నందన్ ఎంట్రీ కి కూడా సమయం ఆసన్నమైనట్లే .. అందుకే ఈ మధ్య కొడుకుని తెగ ప్రమోట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ .. ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అయ్యే నాటికి తన వారసుడ్ని రెడీగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: