ప్రేమ పక్షులు తమన్నా , విజయవర్మకు సంబంధించిన పర్సనల్ విషయాలు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే .. చాలా కాలంగా ప్రేమ లో ఉన్న ఈ ఇద్దరు విడిపోయారంటూ గట్టి ప్రచారం జరుగుతుంది .  అయితే కొన్ని రోజులగా వీరిద్దరూ విడివిడిగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది .. అయితే రీసెంట్ గానే హోలీ వేడుకల్లో  వీరిద్దరూ విడివిడిగా వచ్చి వెళ్ళిపోయారు .. ఇక దాంతో ఇద్దరు విడిపోయారంటూ బాలీవుడ్ మీడియా తెగ‌ ప్రచారం చేసింది .  అయితే ఈ క్రమంలోనే తాజాగా తమన్నా కు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఇక అందులో తమన్నా ధరించిన డ్రెస్ గురించి ఇప్పుడు నేటిజెన్లు తెగ ఆరా తీస్తున్నారు .. ఇంత‌కి అసలు మేటర్ ఏమిటో ఇక్కడ చూద్దాం.


మిల్కీ బ్యూటీ తమన్న , రవీనా టాండన్ కూతురు రాషా తడాని పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు .. ఈసారి ఆమె లుక్ చాలా గ్లామర్ గా మారిపోయింది .. ఈ పార్టీలో తమన్నా ధరించిన‌ జాకెట్ అందర్నీ ఎంతగానో ఆకర్షించింది .  అయితే ఇది విజయ్ వర్మ జాకెట్ అంటూ పలు కామెంట్లు వస్తున్నాయి .. మార్చ్ 16న జరిగిన రాషా తడాని  పుట్టినరోజు వేడుకల్లో తమన్న ఎంతో అద్భుతమైన  నల్లటి బాడీకాన్ గౌనులో దర్శనమిచ్చింది .. ఇక దానిపై నలుపు తెలుపు చారలతో ఉన్న బ్లేజర్ ని కూడా వేసుకుంది .. అయితే అంతకుముందు తమన్నా తో కలిసి ఫోటోషూట్ లో విజయ్ సైతం అలాంటి బ్లేచర్ ధరించాడు .. ఇప్పుడు బ్రేకప్ పుకార్ల మధ్య తమన్నా ప్రత్యేక పోస్ట్ .. మిల్కీ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలు ఒక పోస్ట్ ను షేర్ చేసింది .


ఒక అద్భుతం జరిగే వరకూ అందరూ వేచి చూడండి ... దానిని సాధ్యం చేయండి ... అంటూ రాసుకు వచ్చింది .. ఇక దాంతో తమన్నా , విజయ్ వర్మ  బ్రేకప్ రూమర్స్ మధ్య  ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తమన్న వెంటనే పెళ్లి చేసుకోవాలని చూస్తుందట .. విజయ్‌ మాత్రం ఇంకా సమయం కావాలని అడిగాడని దీంతో ఇద్దరు విడిపోయారని టాక్ బయటకు వచ్చింది .. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇద్దరూ ఎక్కడ స్పందించలేదు .. తమన్నా విజయ్ 2022 నుంచి డేటింగ్ మొదలుపెట్టారు. ఇద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2  లో కూడా నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: