టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ 'రాజమౌళి' కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు తన ముందు ఎంత పెద్ద స్టార్స్ అయినా చేతులు కట్టుకుని ఉండాల్సిందే. అవకాశం కోసం ఎదురుచూసే వాళ్లు చాలామంది నే ఉన్నారు. అయితే ఈ క్రమంలో రాజమౌళితో  చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క‌రు ఆయన సినిమాలో ఒక్కసారి నటిస్తే చాలు అనుకుంటారు. పెద్ద పెద్ద స్టార్లు కూడా  జక్కన్న పిలుపు కోసం వెయ్యక్కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు ప్రతి ఒక్కరూ రాజమౌళి చేతిలో పడాలని అనుకుంటారు. అలానే ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ నటుడు ఇండస్ట్రీలో హిట్ కొట్టలేకపోతున్న తన కొడుకుతో జక్కన్న సినిమా చేయాలని అడిగారు.


ఇంతకీ ఆయన ఎవరు తెలుసా ? ఆ సీనియర్ స్టార్ మరెవరో కాదు.. కలెక్షన్ కింగ్ 'మోహన్ బాబు' తన తనయుడు మంచు విష్ణు తో సినిమా చేయాలని రాజమౌళిని చాలాసార్లు అడిగారని తెలుస్తోంది .. రాజమౌళి డైరెక్ట్ చేసిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు ముఖ్యమైన పాత్రలో నటించ‌రు .ఈ సినిమా షూటింగ్ టైంలో మోహన్ బాబు చాలాసార్లు రాజమౌళిని ఈ విషయంలో కలిసేవారంట. మా విష్ణు తో ఒక సినిమా చెయ్ అంటూ మోహన్ బాబు పదేపదే రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తూ ఉండేవారట. రాజమౌళి చేస్తాను. అని చెప్పినా కరెక్ట్ డేట్ చెప్పు  అంటూ అడిగేవారిని తెలుస్తోంది. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం మోహన్ బాబు దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో విష్ణు హీరోగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు.


ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అన్ని భాషల నుంచి  స్టార్స్ కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కొన్ని పాటలు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రాజమౌళి , మహేష్ బాబు సినిమాను తెరకెక్కించబోతున్నారు. దాని కారణంగానే రాజమౌళి ఫుల్ బిజీ అయిపోయారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాను రూపొందిస్తున్నాడు. రాజమౌళి దానికి తగినట్లుగా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. కొన్ని లీక్ లు కూడా బయటకు వచ్చాయి . అమెజాన్ అడవుల కు సంబంధించి అడ్వైజర్ మూవీగా ఇదిని తెర్కక్కించబోతున్నారు . మహేష్ బాబుకు జంట‌గా  గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతుంది.  2027లో ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న టార్గెట్ తో పనిచేస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: