టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో వెంకీ కుడుముల ఒకరు. ఈయన నాగ శౌర్య హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన ఛలో మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రూపొందించిన విధానానికి గాను వెంకీ కుడుముల కి అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి.

ఆ తర్వాత ఈయన నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా భీష్మ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక భీష్మ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈయన తాజాగా నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా రాబిన్ హుడ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన దాదాపు అన్ని ఏరియాల థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

ఆ అప్డేట్ ఏమిటి అనుకుంటున్నారా ..? రాబిన్ హుడ్ సినిమా యొక్క ఉత్తరాంధ్ర థియేటర్ హక్కులను ఈ సినిమా దర్శకుడు అయినటువంటి వెంకీ కుడుముల దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా దర్శకుడు ఈ మూవీ యొక్క థియేటర్ హక్కులను తీసుకున్నాడు అంటే కచ్చితంగా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉండి ఉంటుంది. అందుకే ఆయన అంత రిస్క్ చేశాడు అని చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: