తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కొంత కాలం క్రితం లవ్ టు డే అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళ్ లో మంచి సక్సెస్ అయిన ఈ సినిమాను తెలుగులో కూడా లవ్ టు డే పేరుతో విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే తాజాగా ఈయన అశ్విత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ ని కొన్ని రోజుల క్రితమే తమిళ్ తో పాటు తెలుగు లో భాషలో కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇలా ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కుతున్న వేళ ఈ మూవీ ఓ టి టి విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మార్చి 21 వ తేదీ నుండి తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: