టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుత మై న క్రేజ్ కలిగిన దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన కొత్త లో అనేక బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. దానితో చాలా తక్కువ కాలం లోనే పూరి జగన్నాథ్ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఇలా స్టార్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను కొనసాగించిన పూరి జగన్నాథ్ కి ఈ మధ్య కాలంలో మాత్రం మంచి విజయాలు దక్కడం లేదు. అనేక అపజయాల తర్వాత కొంత కాలం క్రితం ఈస్మార్ట్ శంకర్ అనే మూవీ తో మంచి సక్సెస్ అందుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత మళ్లీ లైగర్ , డబల్ ఇస్మార్ట్ మూవీలలో వరస పెట్టి భారీ డిజాస్టర్ లను అందుకున్నాడు.

ఇలా వరుస డిజాస్టర్ లతో కెరీర్ ను కొనసాగిస్తున్న పూరి జగన్నాథ్  తన తదుపరి మూవీ ని తమిళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి విజయ్ సేతుపతి తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి కి పూరి జగన్నాథ్ ఓ కథను వినిపించగా , ఆ కథ అద్భుతంగా నచ్చడంతో విజయ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే పూరీ జగన్నాథ్ ఇప్పటికే విజయ్ సినిమాకు ఓ టైటిల్ ను కూడా కన్ఫామ్ చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఆ టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ , విజయ్ తో చేయబోయే సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ టైటిల్ ను అధికారికంగా మేకర్స్ చేయబోతున్నట్లు వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: