టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు కాగా రాజమౌళికి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉన్నాయనే సంగతి తెలిసిందే. పారితోషికం విషయంలో జక్కన్న టాప్ లో ఉన్నారు. జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒడిశా షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయిందని సమాచారం అందుతుండటం గమనార్హం.
 
మహేష్ బాబు రాజమౌళి కాంబో రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో చూడాల్సి ఉంది. అయితే రాజమౌళి కంటే నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు ఎవరనే ప్రశ్నకు నాగ్ అశ్విన్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతోంది.
 
ఈ పదేళ్లలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమాలు మూడు మాత్రమేననే సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. నాగ్ అశ్విన్ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు. సొంత బ్యానర్ లో నాగ్ అశ్విన్ ఎక్కువ సంఖ్యలో సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ కెరీర్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.
 
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాగ్ అశ్విన్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే ఈ డైరెక్టర్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరడం పక్కా అని చెప్పవచ్చు. పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. నాగ్ అశ్విన్ తన టాలెంట్ తో అంచనాలకు మించి ఎదుగుతూ వార్తల్లో నిలుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: