
అయితే ఇప్పుడు ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిసిపోయింది .. సుకుమార్ షారుఖ్ మధ్య ఎలాంటి మీటింగ్ జరగలేదు .. అసలు ఈ మధ్య సుకుమార్ ముంబై వెళ్ళింది లేదని కూడా సుకుమార్ సన్నిహితులు అంటున్నారు .. ఇక పుష్ప సినిమా సమయంలో సుకుమార్ కు బాలీవుడ్ నిర్మాతలు నుంచి కొన్ని ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమే అని .. అయితే సుకుమార్ కు మాత్రం బాలీవుడ్ లో సినిమా చేయాలని ఆలోచన లేదని .. తెలుగులోనే సినిమా తీసి దాన్ని బాలీవుడ్ వరకు తీసుకువెళ్లడమే సుకుమార్ కు ఎంతో ఇష్టమని వారు చెబుతున్నారు ..
నిజానికి పుష్ప తో కూడా సుకుమార్ చేసింది అదే .. తెలుగులో చేసిన సినిమాని బాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది .. దాంతో అక్కడ సుకుమార్ తో సినిమా చేయడానికి చాలామంది హీరోలు లైన్లో ఉన్నారు .. ఇక రామ్ చరణ్ సినిమా అవ్వాలి పుష్ప3 ఉంది ప్రభాస్ , విజయ్ దేవరకొండ ఇలా తర్వాతా పెద్ద లిస్టు వెయిటింగ్ లో ఉంది .. ఇవన్నీ వదులుకొని సుకుమార్ బాలీవుడ్ కి వెళ్ళటం అనేది కష్టమే .. మరి ఆ వార్తలు ఎలా వచ్చాయో ఎవరి పుట్టించారు అనేది వారికే తెలియాలి .