కమీడియన్ గా కెరియర్ను మొదలు పెట్టి హీరో గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న తెలుగు నటులలో ప్రియదర్శి ఒకరు. ఈయన పెళ్లి చూపులు అనే సినిమాలో చిన్న కమెడియన్ పాత్రలో నటించి ఈ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈ నటుడు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ప్రియదర్శి ఈ మధ్య కాలంలో వరస పెట్టి సినిమాల్లో హీరో పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. అలాగే ఈయన హీరోగా నటించిన చాలా సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు హీరోగా గుర్తింపు రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. తాజాగా ప్రియదర్శి నాచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ మార్చి 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను మార్చి 12 వ తేదీ నుండి ఈ మూవీ బృందం వారు ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు విడుదల అయిన తేదీ నుండి కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ సినిమాకు యూ ఎస్ ఏ లో అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు యూ ఎస్ ఏ లో వచ్చిన కలెక్షన్లకు సంబంధించిన అఫీషియల్ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు యూ ఎస్ ఏ లో 750 ప్లస్ కే కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: