గత కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పైన యూట్యూబర్ అన్వేష్ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించి పలు రకాలు వీడియోలను కూడా షేర్ చేయడం జరిగింది. అలాగే ఐపీఎస్ సజ్జనార్ తో మాట్లాడడం కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను సైతం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. డబ్బులు తీసుకొని మరి ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉండడంతో సోషల్ మీడియా యూజర్స్ ని ,యూట్యూబర్స్ ని చాలామంది సినీ సెలబ్రిటీల పైన కొరడా విధించేలా ప్లాన్ చేశారు.

దీంతో చాలామంది యూట్యూబర్స్ పైన సోషల్ మీడియా యూజర్స్ పైన కేసులు నమోదు కావడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి అటు పల్లవి ప్రశాంత్, హర్ష సాయి, ఇతరత్రా సెలబ్రిటీల పేర్లు అన్వేష్ బయటపెట్టారు.. ముఖ్యంగా వీరిపై చాలామంది ఆగ్రహాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే అన్వేష్ టాలీవుడ్ హీరోల గురించి వారి యొక్క మంచితనం గురించి పలు విషయాలను తెలియజేశారు.. మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సేవా కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది.


ఒక చేత్తో చేసిన సహాయాన్ని మరొక చేతికి తెలియకుండా సహాయం చేస్తున్నారని అదే మన భారతీయ సంస్కృతి అని టాలీవుడ్ మహేష్ బాబు ఎంతోమంది వేలాదిమంది పిల్లలకు ఉచితంగా గుండె సర్జరీ చేయించారు ఇది చాలా మందికి తెలియకపోవచ్చు.. వీటి గురించి ఏ ఒక్క వీడియో అయినా ఎప్పుడైనా బయటికి వచ్చిందా ఆయన ఎంతోమంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన దేవుడు అంటూ సహాయం అంటే ఇదే అంటూ తెలిపారు.. ఇక బాలకృష్ణ కూడా  తన అమ్మ గారి పేరిట బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి క్యాన్సర్ చికిత్స చేయిస్తున్నారని ఎక్కడా కూడా ఈ వీడియోలు బయటపడలేదని ఆయన కూడా దేవుడే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామందికి అప్పన్న హస్తం అందిస్తున్నారని తెలియజేశారు యూట్యూబర్ అన్వేష్.. దీంతో ఈ వీడియోని అభిమానుల సైతం వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: