
ఇక దానికి నాగ్ అశ్విన్ తెలియదు అని సమాధానం ఇచ్చాడు . అలాగే ఈ ప్రశ్నలు నిర్మాతను అడిగాలని వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి కొన్ని ప్రశ్నలకు చెప్పను అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు .. ఇలా చెప్పను అంటూనే కొన్ని విషయాల పై నాగ్ అశ్విన్ ఒక క్లారిటీ ఇచ్చాడు . కల్కి 2 సినిమా ని ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ కె తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నాడు .. అలాగే పార్ట్ 2 కు సంబంధించి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని .. మొదటి భాగం లో ప్రభాస్ స్క్రీన్ టైమ్ తగ్గింది .. అయితే రెండో భాగం లో అలాంటి అనుమానాలు ఉండవు .. మొదటి పార్టు లో మహాభారతం సెట్ చూపించాం ..
సుమతి , అశ్వద్ధామ క్యారెక్టర్లు చూపించాం .. ఇక అవన్నీ చూపిస్తూ పార్ట్ 2 వరకు తీసుకువెళ్లాం .. సో ఇప్పుడు పరిచయాలు స్టోరీ లైన్ అన్ని అర్థమయిపోయాయి .. ఇక మిగిలింది భైరవ , కర్ణ యాంగిల్స్ మాత్రమే .. రెండో భాగం లో మొత్తం అదే నడుస్తుంద ని ప్రభాస్ సినిమా మొత్తం ఉంటాడు .. ఈ విధంగా కల్కి 2 రిలీజ్ పై ఎలాంటి టార్గెట్స్ పెట్టు కోలేదని కూడా చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్ . అలాగే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడం లేక నిర్మించడమా చేయవచ్చని . కానీ తన సమయం మొత్తం కల్కి 2 తోనే అయిపోతుంది అంటున్నాడు .