సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  హీరోయిన్ సమంత పేరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు ఏ రేంజ్ లో బాగా ఎక్కువగా ట్రెండ్ అయింది అనేది అందరికి తెలిసిందే. అయితే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న మూమెంట్ లో ట్రెండ్ అయిన దానికన్నా కూడా విడాకులు తీసుకున్న తర్వాత పేరు ట్రెండ్ అయిన విధానం చూస్తే అందరికీ షాకింగ్ గానే ఉంటుంది .


నేషనల్ మీడియాలో సైతం సమంత - నాగచైతన్య విడాకులు గురించి ప్రస్తావించారు అంటే ఈ జంట ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు.  ప్రెసెంట్ నాగచైతన్య తన మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే  శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం సింగిల్గానే తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ సినిమాల పరంగా ముందుకు వెళుతుంది . కాగా ఇప్పుడు సమంతకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



హీరోయిన్ సమంత తన మొబైల్ లో లవ్ అంటూ ఎవరి పేరు సేవ్ చేసుకుంది అనే విషయం బాగా వైరల్ గా మారింది , సాధారణంగా ఇలాంటి పేర్లతో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ పేర్లను సేవ్ చేసుకుంటూ ఉంటారు . కానీ సమంతకి మాత్రం ఇప్పటికి తన బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తన నాన్న . ఆ కారణంగానే తన నాన్న నెంబర్ లవ్ అంటూ సేవ్ చేసుకుందట . రీసెంట్ గానే సమంత నాన్నగారు చనిపోయారు . ఆ టైంలో సమంత చాలా చాలా బాధపడింది . సమంత లైఫ్ లో వాళ్ళ నాన్నగారు ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు.  సమంత నాన్నగారు చనిపోయినప్పుడు పెట్టిన పోస్ట్ ఆమె ఎంత ఎమోషనల్ గా బాధపడిందో అందరికీ గుర్తుండే ఉంటుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: