టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజురోజుకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి శ్రీలీల ఒకరు. ఈ చిన్నది టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంది.


దాదాపు ఈ చిన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన హీరోయిన్ గా నటిస్తూ తన హవాను కొనసాగిస్తోంది. ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకోవడం గమనార్హం. లేటెస్ట్ గా ఈ చిన్నది పుష్ప-2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ లీల ఈ పాటలో చాలా హాట్ గా తన డ్యాన్స్ టాలెంట్ ను చూపించింది. కాగా, ప్రస్తుతం ఈ చిన్నది రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో నితిన్ హీరోగా చేయగా... శ్రీ లీల హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.


కాగా, ఈ సినిమా ఈ నెల మార్చి 28వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో శ్రీ లీల, నితిన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. శ్రీ లీల తన కెరీర్ ప్రారంభ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందట. తన నటన, అందం చూసిన నిర్మాతలు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి చివరకు అవకాశాలు ఇవ్వకుండా టార్చర్ పెట్టారట.


శ్రీలీల ఎలాంటి కమిట్మెంట్స్ కి ఒప్పుకోకపోగా, కనీసం రొమాంటిక్ సన్నివేశాలలో కూడా చేయడానికి పెద్దగా ఇష్టపడదు. దీంతో ఈ చిన్న దానికి సినిమా అవకాశాలు ఇవ్వడానికి కెరీర్ ప్రారంభంలో ఎవరు పెద్దగా ఆసక్తిని చూపించలేదట. అనంతరం ఈ బ్యూటీ క్రేజ్ చూసి ప్రతి ఒక్కరూ ఈ చిన్నదానితో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: