సమ్మర్ అంటే క్రికెట్ ప్రియ‌ల‌కు ఎంతో ఆనంద‌ని ఇచ్చే ఐపీఎల్ సీజన్ వచ్చేస్తుంది .. రెండు నెల పాటు సాయంత్రం ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ చర్చ జరుగుతూ ఉంటుంది .. అదే క్రమంలో ఐపీఎల్ వర్సెస్ సీరియల్స్ .. మ్యాచ్ చూడాలని యూత్ సీరియల్స్, న్యూస్ చూడాలని పెద్దలు అనుకుంటారు అయితే ఓటిటిలో ఐపీఎల్ స్ట్రీమింగ్ మొదలయ్యక ఇబ్బంది చాలా వరకు తగ్గిపోయింది .. అయితే ఓ చర్చ మాత్రం అలాగే మిగిలిపోయింది . అదే ఐపీఎల్ వర్సెస్ సినిమా .. గత 18 ఏళ్ల క్రితం వరకు ఇండియన్ సినిమాకు సమ్మర్ అనేది ఓ బెస్ట్ సీజన్ .


సంక్రాంతి సీజ‌న్‌ తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేది కూడా సమ్మర్ సీజన్లోనే . అయితే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాక అది బాగా తగ్గిందనే చెప్పవచ్చు .. మార్నింగ్ రెండు షోల‌ విషయంలో వేసవి ఎండలను తట్టుకోలేక ప్రేక్షకులు థియేటర్లకు రావటం తగ్గితే . రాత్రి 2 షోల విషయంలో ఐపిఎల్ ఎక్కువ ఆధిపత్యం చూపిస్తుంది .  ఇక దీంతో సమ్మర్లో సినిమాలకు యువత రాక విషయంలో మొదటి రెండు షోలే కీలకంగా మారాయి .. ఇప్పుడు మరో మూడు రోజుల్లో ఐపీఎల్ మొదలు కాబోతోంది రెండు నెలల పాటు ఈ హడావుడి గట్టిగా ఉంటుంది .


అయితే సినిమాల రాక కూడా ఆ సమయంలోనే ఉంటుంది .. ఐపీఎల్ హీట్ ని సినిమాలు తట్టుకోగలవా ? తట్టుకున్న కలెక్షన్లు అందుకుంటాయా అనేది కాలమే సమాధానం చెప్పాలి .. భారీ స్కోరులు , అదిరిపోయే బ్యాటింగ్ , బౌలింగ్ విన్యాసాలతో గత సంవత్సరం ఐపిఎల్ ఎంతో కసిగా సాగింది .. ఇక ఇప్పుడు ఈసారి కూడా అంతకుమించి ఉంటుందని చెప్పవచ్చు .. అయితే ఈ సమ్మర్‌లో రానన్న సునమాల సంగతి చూస్తే .. ఏవి తట్టుకుంటాయి ఏవి చతికిలపడతాయి అనేది కూడా ప్రేక్షకులు తెలిసిపోతుంది ..


ఈ సమ్మర్ లో వచ్చే సినిమాల విషయానికి వస్తే .. నితిన్ రాబిన్‌హుడ్ , సంగీత శోభన్ , నార్నే నితిన్ , రామ్ నితిన్ కలిసి నటించిన మాడ్ స్క్వేర్ , సిద్దు జొన్నలగడ్డ జాక్ , అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ , అనుష్క , క్రిష్‌ కాంబోలో వస్తున్న ‘ఘాటి’ , ప్రభాస్ రాజా సాబ్ , ప్రియదర్శి సారంగపాణి జాతకం , మంచు విష్ణు కన్నప్ప , నాని హిట్ 3 , పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు , రవితేజ మాస్ జాతర , విజయ్ దేవరకొండ కింగ్డమ్ .. ఇలా సమ్మర్ లో ముందుకు రావడానికి రెడీగా ఉన్నాయి .. అయితే వీటిలో ఎన్ని పోటీ సమయానికి రెడీగా ఉంటాయో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: