
దేవర సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది అన్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే వార్ 2 సినిమాతో ఆ లోటు ని తీర్చేయబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . వార్ 2 అంటే బాలీవుడ్ సినిమా . తెలుగు జనాలకి పెద్దగా నచ్చకపోవచ్చు . కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా మాత్రం ఆయన కెరియర్ని మలుపు తిప్పుతుంది అంటూ అంతా భావించారు . అయితే ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్మెంట్ ఇచ్చారు . రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేశారు . కొన్ని కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు . అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన సీన్ లు ఎక్కడి కూడా షూట్ చేయలేదు.
ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమా సెట్స్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం అందుతుంది . అయితే ఇప్పుడు సమ్మర్ తర్వాత కాదు దసరా తర్వాతనే ఈ సినిమా షూట్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారట . ఎందుకంటే ఆయన దేవర 2 సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట. దేవర 2 సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది . ఆ కారణంగానే ప్రశాంత్ నీల్ సినిమాను వెనక్కినెట్టి మరి దేవర 2 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉండిపోయారు జూనియర్ ఎన్టీఆర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అయోమయమైన పరిస్థితి అని చెప్పాలి . ఒకపక్క దేవర 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఎలా తెరకెక్కబోతుందో..? ఏమైపోతుందో..? ఏ సినిమా రిలీజ్ అవుతుంది అని ఆశపడాలో ఎప్పుడు సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని బాధపడాలో తెలియని పరిస్థితి అయిపోయింది అంటూ మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్..!