మెగా హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో  వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నారు .. వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవి ఆదే సంవత్సరం ‘భోళా శంకర్’  సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు .. అయితే ఇప్పుడు విశ్వంభర సినిమా చేస్తున్నారు సోసియో ఫాంటసీ మూవీ కాబట్టి కచ్చితంగా ఇది హీట్ అవుతుందని అంత అనుకుంటున్నారు .. మెగా అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు .. మరొ ప‌క్క‌ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీర‌మల్లు కూడా మే 9న రిలీజ్ కాబోతుంది . అయితే కానీ మెగా అభిమానులు పవన్ సినిమా పై అసలు నమ్మకం పెట్టుకోలేదు .. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు టైం చేసుకున్నారు ..


దర్శకుడు క్రిష్  మొదలు పెట్టిన ఈ సినిమా మధ్యలో బడ్జెట్ సమస్యల కారణంగా కొన్నాళ్లు అలా ఆగిపోయింది .. తర్వాత క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం .. నిర్మాత  రత్నం కొడుకు జ్యోతి కృష్ణ మిగిలిన సినిమాని కంప్లీట్ చేశాడు .. మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే తప్ప ఈ సినిమా ఆడే పరిస్థితి లేదని అభిమానులు కూడా అంటున్నారు . ఇక మరో పక్క త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య , గేమ్ చేంజర్ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి .. సాయి దుర్గ తేజ విరూపాక్షతో హిట్ అందుకున్న తర్వాత బ్రో సినిమా తో డిజాస్టర్ అందుకున్నాడు .. వైష్ణవ తేజ్ చేసిన కొండపొలం , రంగ రంగ వైభవంగా , ఆది కేశవ లాంటి సినిమాలు ఒక్కదాన్ని మించి మరొకటి డిజాస్టర్ గా మిగిలాయి ..


అలాగే వరుణ్ తేజ్ చేసిన గాండీవ్ దారి అర్జున , ఆపరేషన్ వాలెంటైన్ , మట్కా సినిమాలు భారీ డిజాస్టర్స్ అయ్యాయి.  వీరిలో మెగా డాటర్ నిహారిక మాత్రం కమిటీ కుర్రాళ్ళతో నిర్మాతగా విజయమందుకుంది .. ఇలా మెగా హీరోలంతా ఇప్పుడు వరస అపజయాల్లో ఉన్నారు .. ఎవరో ఒకరు హిట్‌ కొడితే అందరిలో కొంత జోష్ వస్తుంది .. అది చిరంజీవి విశ్వంభర నుంచి మొదలవ్వాలి అనేది మెగా అభిమానుల కోరిక .. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి .. ఇక మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: