
మరి ముఖ్యంగా నాగచైతన్య మాస్ యాంగిల్ లో అస్సలు నటించలేడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉంటారు. "ఆటోనగర్ సూర్య" సినిమా ఎంత చెత్త టాక్ అందుకుందో అందరికీ తెలిసిందే . కాగా ఇప్పుడిప్పుడే క్లాస్ హిట్ అందుకుంటూ "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య .. మరొక మాస్ సినిమా చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బోయపాటి శ్రీను కి కూడా పెద్దగా హిట్లు లేవు .
కానీ ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాడు . కచ్చితంగా ఇది హిట్ అవుతుంది. నాగచైతన్యతో సినిమాకి కమిట్ అవుతున్నాడట . ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నాగచైతన్య ఖాతాలో మరో ఫ్లాప్ తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో..? అయితే ప్రసెంట్ నాగ చైతన్య ఒక పక్క మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరో పక్క సినిమాలని కూడా చక చక ఓకే చేస్తూన్నారు. రీసెంట్ గానె "తండేల్" సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.