టాలీవుడ్ క్రేజీ మూవీ “ ఈ నగరానికి ఏమైంది “ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..యంగ్ హీరో విశ్వక్ సేన్ లీడ్ రోల్లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ మూవీ ఇది.. సింపుల్ స్టోరీతో యూత్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది..ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా నచ్చింది.. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రారంభంలో  టార్గెట్ ఆడియెన్స్  కి పెద్దగా కనెక్ట్ కానప్పటికీ, మీమ్స్ వల్ల ఈ సినిమా నెట్టింట ఎంతో పాపులర్ అయ్యింది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ను రూపొందించేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు సమాచారం. '

'35 చిన్న కథ కాదు' చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఒరిజినల్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుందని తెలుస్తుంది.. 'పెళ్లి చూపులు' వంటి సూపర్ సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన రెండవ సినిమా ఇది..ఈ సినిమాలో విశ్వక్ సేన్తో పాటు అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, సాయి సుశాంత్ కముఖ్య పాత్రల్లో నటించారు..నలుగురు స్నేహితుల జీవితాల్లో జరిగిన ఘటనలు అలాగే కాలేజీ లైఫ్ గురించి ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు.

రీసెంట్గా ఈ సినిమా రీరిలీజ్ చేయగా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి..తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ఈ సంవత్సరమే మొదలు పెడుతున్నట్లు తరుణ్ భాస్కర్ ప్రకటించారు..ఈ మేరకు ఇన్ స్టా లో ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలని పోస్ట్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..ఈ సినిమా సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ బ్యాచ్ తోనే తీస్తారా.. లేదా ఫ్రెష్ గ్యాంగ్ ని సెలెక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: