టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ఆఖరుగా నటించిన 9 మూవీలకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

కిరణ్ అబ్బవరం తాజాగా దిల్రూబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 45 లక్షల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. కిరణ్ హీరోగా రూపొందిన "క" మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.45 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఇక కిరణ్ హీరోగా రూపొందిన రూల్స్ రంజన్ మూవీ మొదటి రోజు 40 లక్షల కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కిరణ్ హీరోగా రూపొందిన మీటర్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల కలెక్షన్లు మాత్రమే దక్కాయి.

ఇక కిరణ్ హీరో గా రూపొందిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.35 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కిరణ్ హీరోగా రూపొందిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇక కిరణ్ హీరోగా రూపొందిన సమ్మతమే మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 52 లక్షల కలెక్షన్లు దక్కగా ,  సే పిసి 524 మూవీ కి 40 లక్షల కలెక్షన్లు దచ్చాయి. ఇక కిరణ్ హీరో గా రూపొందిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.41 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: