
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిన్నది ప్రేమ వ్యవహారాలు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ చిన్నది ప్రేమించింది ఎవరా అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపిస్తున్నారు. తెలుగు, తమిళ సినిమాలలో హీరోయిన్గా నిధి అగర్వాల్ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేస్తోంది. ఒకటి పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.
మరొకటి ప్రభాస్ తో కలిసి ది రాజా సాబ్ సినిమాలో ఈ చిన్నది నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కనుక మంచి విజయాలను అందుకున్నట్లయితే ఈ చిన్నదాని రేంజ్ ఒక్కసారిగా మారిపోతుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.... నేటి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా కూడా బెట్టింగ్ యాప్స్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు చాలా సీరియస్ అయ్యింది. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలపై, సామాన్య మానవులపై కేసులు కూడా నమోదు అయ్యాయి.
ఇప్పుడు వీరి జాబితాలోకి ఈ యంగ్ బ్యూటీ కూడా చేయబోతుందా అనే సందేహంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే గతంలో నిధి అగర్వాల్ "jeetWin"అరే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ చిన్నదానిపై కూడా కేసు నమోదు చేయాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. మరి నిధి అగర్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారా లేదా అనే సందేహంలో అనేకమంది ఉన్నారు.