టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడి గా , నిర్మాత గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు . ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాల్లో హీరోగా నటించి అ నే క మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు . ఇక పోతే కొంత కాలం ఈయన బింబిసారా అనే సినిమాలో హీరోగా నటించి మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన అమిగోస్ , డెవిల్ మూవీలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ , అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అజనీష్ లోకనాథ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్  సహా అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్  ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో అలనాటి స్టార్ నటి అయినటువంటి విజయశాంతి , కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటలు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 12.20 మిలియన్ వ్యూస్ ... 164.6 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ యొక్క టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ 24 గంటల్లో లభించింది అని చెప్పవచ్చు. ఈ మూవీ టీజర్ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr