మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిహారిక తన టాలెంట్ తో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగడంతో పాటు పాపులారిటీని ఊహించని స్థాయిలో పెంచుకున్నారు. నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. నిహారిక రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.
 
తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో సైతం నటిస్తున్న నిహారిక కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే నిహారిక నిర్మాతగా మరో సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఒకింత భారీ బడ్జెట్ తోనే నిహారిక రెండో సినిమా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నిహారిక రెండో సినిమాకు మానస అనే యువతి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
 
సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్ల సంఖ్య చాలా తక్కువ అనే సంగతి తెలిసిందే. ఉన్న కొద్దిమంది లేడీ డైరెక్టర్లు సైతం ప్రస్తుతం ఎక్కువ సినిమాలను తెరకెక్కించడం లేదు. నిహారిక నిర్మాతగా ఊహించని స్థాయిలో సక్సెస్ కాగా మానస సైతం దర్శకురాలిగా ఒక వెలుగు వెలుగుతారేమో చూడాల్సి ఉంది. నిహారిక హీరోయిన్ గా కూడా విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
వ్యక్తిగత జీవితం విషయంలో నిహారిక ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నిహారిక సక్సెస్ సాధిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుని నిహారిక బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నిహారిక కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.  నిహారిక పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.  హీరోయిన్ నిహారికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.


  

మరింత సమాచారం తెలుసుకోండి: