టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో విజయ శాంతి , కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని విజయ శాంతి నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ టీజర్ మీడియం రేంజ్ హీరోల టీజర్ల విషయం లో సరికొత్త రికార్డు ను సృష్టించింది. మీడియం రేంజ్ హీరోలు నటించిన మూవీ టీజర్లలో నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ టీజర్ కి 24 గంటల్లో 17.12 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ మూవీ టీజర్ మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమా టీజర్లలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే ఇన్ని రోజుల పాటు విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే పాన్ ఇండియా మూవీ 11.88 మిలియన్ వ్యూస్ తో రెండవ స్థానంలో కొనసాగింది.

ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా కింగ్డమ్ మూవీ ని వెనక్కి నెట్టేసి 12.20 మిలియన్ వ్యూస్ తో రెండవ స్థానం లోకి వచ్చేసింది. ఇలా ఈ మూవీ ఏకంగా పాన్ ఇండియా మూవీ అయినటువంటి కింగ్డమ్ మూవీ టీజర్ వ్యూస్ ను భారీ మార్జిన్ తో క్రాస్ చేసి రెండవ స్థానం లోకి వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr