
కంగనా రనౌత్ ప్రస్తుతం ఎంపీగా కూడా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ సినిమా గురించి దర్శకనిర్మాత సంజయ్ గుప్తా ఇచ్చిన రివ్యూ గురించి కంగనా రనౌత్ రియాక్ట్ కావడం జరిగింది. నాపై ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు ఆయన తన పోస్ట్ లో అంగీకరించారని కంగనా రనౌత్ తెలిపారు. నన్ను అర్థం చేసుకునే విషయంలో మీరు ఫెయిల్యూర్ అయినప్పుడు మళ్లీ నాపై ఒక అభిప్రాయానికి రావాలని ఎందుకు అనుకుంటారని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.
నేను ఎలాంటి సినిమా చేశానో మీకు ముందుగానే తెలుసని నా గురించి ముందే తెలుసుకునేందుకు మీ దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయా అంటూ కంగనా రనౌత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి గురించి ఏదైనా అభిప్రాయానికి రావాలంటే వాళ్ల గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఉండాలని కంగనా పేర్కొన్నారు. అయినా నన్ను జడ్జ్ చేయడానికి మీకున్న అర్హతలు ఏమిటని ఆమె అన్నారు.
కంగనా రనౌత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతున్నాయి. కంగనా రనౌత్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉండగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ నటి ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సైతం కంగనాను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కంగనా క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.