సినిమా ఇండస్ట్రీ లో ఏదైనా ఒక హీరోకు వరస పెట్టి ఫ్లాప్ లు వచ్చాయి అంటే అలా వరుస ప్లాపుల తర్వాత ఆ హీరో నటించే సినిమాకు జనాల్లో పెద్దగా క్రేజ్ ఉండకపోవడం , దానితో ఆ మూవీ కి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్ద స్థాయిలో జరగకపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం హీరోకు భారీ ఫ్లాప్ లు ఉన్న కూడా ఆ మూవీ విడుదలకు ముందు ఆ సినిమా నుండి విడుదల చేసిన కంటెంట్ అద్భుతంగా ఉన్నట్లయితే ఆ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడడం , ఆ మూవీ కి అద్భుతమైన ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడం జరుగుతూ ఉంటుంది.

ఇకపోతే ఇలా ప్రస్తుతం నితిన్ కి జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ యువ నటుడు నితిన్ ఈ మధ్య కాలంలో వరుస అపజయాల డీలా పడిపోయాడు. కొంత కాలం క్రితం ఈయన హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈయన నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈ నటుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే వరుస ప్లాపుల్లో ఉన్నా కూడా నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ మూవీ కి నైజాం ఏరియాలో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రాబిన్ హుడ్ సినిమాకు నైజాం ఏరియాలో ఏకంగా 10.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే నైజాం ఏరియాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా నైజాం ఏరియాలో ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: