తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోగా నటించాడు. కానీ అందులో కొన్ని మూవీలతో మాత్రమే ఈయనకు మంచి విజయాలు దక్కాయి. కొంత కాలం క్రితం కిరణ్ "క" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు "క" మూవీ కనుక ఒక వేళ హిట్ కాకపోతే తాను సినిమాలే వదిలేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా కిరణ్ "క" మూవీ విషయంలో భారీ స్టేట్మెంట్ ఇవ్వడంతో కచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది అని ప్రేక్షకులు అనుకున్నారు.

ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. తాజాగా కిరణ్ "దిల్రుబా" అనే సినిమాలో హీరో గా నటించాడు. "క" లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత కిరణ్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ మార్చి 14 వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతుంది. ఇప్పటివరకు ఈ మూవీ కి సంబంధించిన 4 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 1.17 కోట్ల రేంజ్ లో షేర్ ... 2.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కి ఏకంగా 12 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

దానితో ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 10 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ కి మరో 10 కోట్ల షేర్ కలెక్షన్లు రావడం కష్టమే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: