
తెలుగులో తొట్ట తొలి ఓటీటీ సంస్థగా ఆవిర్భవించింది ఆహా ఆవిర్భవించింది. బలమైన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సపోర్ట్‌గా ఉన్నారు . . కావాల్సినంత పెట్టుబడి పెట్టారు. అయితే కంటెంట్ తో ప్రేక్షకుల నాడి పట్టుకునే విషయంలో ఆహా అంచనాలు ఎందుకో గాని అందుకోలేదు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలను కొనడం లో విఫలమైంది. కొంత కాలంగా ఆహా నష్టాల భాటలో నడుస్తుందన్న ప్రచారం ఉంది. అసలు ఈ టీవీ విన్ ఆహా తో పోలిస్తే ప్రారంభం లో చాలా వెనకప డి ఉంది. అలాంటిది ఇటీవల ఈ టీవీ విన్ బాగా పుంజుకుంది. .
ఈటీవీ ఒరిజినల్స్ కొన్ని మంచి విజయాలను అందుకోవడంతో పాటు చిన్న చిన్న బడ్జెట్ లలో ఈటీవీ విన్ వెబ్ సీరిస్‌లు.. చిన్న చిన్న సినిమాలు తీస్తోంది. కొంటోంది. అందుకే చిన్న .. మిడిల్ రేంజ్ సినిమాలు అన్నీ ఈటీవీ విన్‌కు వెళ్లి పోతున్నాయి. ఇక ఆహా లో కంటెంట్ సెలక్ట్ చేసే టీం ఎందుకో గాని ప్రేక్షకుల నాడి అయితే పట్టుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ఆహాలో మార్పులు మొదలైనట్టుగా తెలుస్తోంది.
కొందరు ఉద్యోగులను తొలగించినట్టుగా తెలుస్తోంది. కొత్తవాళ్లొస్తే … కొత్త ఆలోచనలు వస్తాయన్నది ఆహా ఆలోచన కావొచ్చు అంటున్నారు. ఏదేమైనా ఆహా కు మంచి క్రేజ్ వచ్చింది. అన్ స్టాపబుల్ షో తో దాని క్రేజ్ ఎక్కడికో వెళ్లింది . . ఇప్పుడు అయినా ఆహా నిలదొక్కు కోవాలంటే ఒర్జినల్ కంటెంట్ తో రావాల్సిందే. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆహా లో కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్లు అయినా ఇకపై క్రియేటివిటి గా ఆలోచించి ఆహా ను ముందుకు నడిపిస్తారేమో ? చూడాలి.