నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాధారణ మోడల్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయ బ్మైన ప్రియమణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతితక్కువ సమయంలోనే ఈ చిన్నది ప్రతి ఒక్క స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.



ఈ సినిమాలో జగపతిబాబు సరసన హీరోయిన్ గా నటించి ఎనలేని గుర్తింపును అందుకుంది. అనంతరం ఈ చిన్న దానికి తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అంతే ఒక్కసారిగా ప్రియమణి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక తెలుగు సినిమాతోనే పరిచయమైన ప్రియమణి మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాష సినిమాలలో నటించింది. అన్ని భాషలలో ఎక్కువగా ఈ చిన్న దానికి తెలుగు వారే అవకాశాలను ఇవ్వడం విశేషం.



అలా తెలుగు సినిమాలలో నటిస్తూ తెలుగు వారికి దగ్గరైన ఈ చిన్నది తమిళ సినిమా పరుత్తి వీరన్ ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. ఇదిలా ఉండగా.... ప్రియమణి సినిమాలలో నటిస్తున్న సమయంలో అనేకమంది హీరోలతో ప్రేమాయణం కొనసాగించిందని అనేక రకాల వార్తలు వచ్చాయి. అందులో ఒక హీరోతో పెళ్లి పీటల వరకు ఈ చిన్నదాని ప్రేమ వ్యవహారం వెళ్లిందట. ఇక ఏమైందో తెలియదు ఆ హీరో కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని అసలు ఒప్పుకోలేదట.


అనంతరం ప్రియమణి ఆ హీరోతో బ్రేకప్ చెప్పి వరుసగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రియమణి ఓ ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిన్నది చాలా సంతోషంగా తన భర్తతో కలిసి హ్యాపీ లైఫ్ ను కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ప్రియమణి వరుసగా సినిమాలలో నటిస్తూ మరోవైపు షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: