సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ భావన అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ మహాత్మ సినిమాలో శ్రీకాంత్ కి జోడిగా నటించి టాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది. ఈ మూవీలోని నీలపూరి గాజుల ఓ నీలవేణి అనే పాటతో భావన అందరి కి గుర్తుండి పోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో కంటే ఎక్కువగా మలయాళం లో ఫేమస్ నటి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కూడా మలయాళం ఇండస్ట్రీ ద్వారానే.అలా మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. తెలుగులో హీరో, ఒంటరి,మహాత్మా వంటి సినిమాల్లో నటించింది. అయితే భావన జీవితంలో కొన్ని వివదాలు కూడా ఉన్నాయి.ఆమెని ఒక నటుడు టార్చర్ చేశాడు అంటూ ఆ మధ్యకాలంలో ఓ వార్త వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

మరి భావన నిజంగానే విడాకులు తీసుకోబోతుందా.. తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ లో ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో హీరోయిన్గా దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించిన అనుభవం భావనది. అయితే ఈ హీరోయిన్ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే కన్నడ నిర్మాత అయినటువంటి నవీన్ తో ప్రేమలో పడింది. అలా ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారి తీసింది. అలా ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న భావన నవీన్ లు విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోబోతున్నారు అంటే ముందుగానే హింట్స్ ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేయడం, వాళ్ళ ఫోటోలు డిలీట్ చేయడం, వాళ్ళ పేర్లలో నుండి వారి పేరుని తీసివేయడం. ఇలా ఎన్నో హింట్స్ ఇస్తూ ఉంటారు.

కానీ భావన ఇవేవీ చేయకుండానే ఆమెపై విడాకుల వార్తలు వచ్చాయి.అయితే తాజాగా విడాకుల వార్తలపై గట్టి కౌంటర్ ఇచ్చింది భావన.ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ నా భర్తతో కలిసి ఉన్న ఫోటోలను మా పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే మేము విడిపోతున్నామని అందరూ అనుకుంటున్నారు.కానీ మేం విడాకులు తీసుకోవడం లేదు. అవన్నీ ఉత్త ప్రచారాలు మాత్రమే.మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికైనా ఈ వార్తలు ఆగిపోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఈ పోస్ట్ పెట్టాను అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో భర్తతో విడాకులపై క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ భావన. మరి స్వయంగా భావననే క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఈ విడాకుల వార్తలపై రూమర్లు ఇప్పటికైనా ఆగిపోతాయేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: