చాలా రోజుల నుండి ఓ తెలుగు డైరెక్టర్ తమిళ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు ఆ డైరెక్టర్ దగ్గర నమ్మకంగా ఉండే ఓ వ్యక్తి ఆ డైరెక్టర్ భార్యకు అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని బయట లీక్ చేస్తూ ఆ డైరెక్టర్ మళ్ళీ తన భార్య దగ్గరికి వచ్చేలా ఎన్నో మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికేఆ డైరెక్టర్ భార్య సూసైడ్ చేసుకుందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇన్ని రోజులు ఆ డైరెక్టర్ పేరు బయటపడకపోయినప్పటికీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆ డైరెక్టర్ ఎవరు ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం మాత్రం బయటపడింది.ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె సినిమా తీసిన శ్రీకాంత్ అడ్డాల.. ఈ డైరెక్టర్ తన మూవీ హీరోయిన్ తమిళ నటి అయినటువంటి ప్రియాతో ఎఫైర్ పెట్టుకున్నారని, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని, శ్రీకాంత్ అడ్డాల తన భార్యని దూరం పెట్టి ప్రియా తో చెన్నైలో ఒక ఫ్లాట్ లో సహజీవనం చేస్తున్నారంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. 

అయితే ఈ వార్తలపై తాజాగా ఓ నటుడికి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఇక ఆ నటుడు ఎవరో కాదు తమిళ సీనియర్ నటుడు డైరెక్టర్ నిర్మాత అయినటువంటి పార్థిబన్. అయితే తమిళనటి ప్రియా ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది పార్థిబన్ కావడంతో ఈ ప్రశ్న ఆయనకు ఎదురయింది.ఇక పార్థిబన్ శ్రీకాంత్ అడ్డాలపై మాట్లాడుతూ.. శ్రీకాంత్ అడ్డాల ప్రియా ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు అనే మెసేజ్ నా ఫోన్ కి కూడా వచ్చింది. అంతే కాదు కొంతమంది నాకు కాల్ చేసి అడిగారు. ఎందుకంటే ప్రియని ఒక షార్ట్ ఫిలిం ద్వారా నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను.కాబట్టి నాకు ఏమైనా తెలిసి ఉంటుందని నన్ను అడిగారు. అయితే ప్రియా మల్టీ టాలెంటెడ్. ఆమెకు చాలా టాలెంట్ ఉంది.కానీ ఇలాంటి వార్తలు ఆమె కెరియర్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.ఇప్పటివరకు ప్రియా నాలుగైదు సినిమాలు మాత్రమే చేసింది.

కానీ ఈ నాలుగైదు సినిమాలకే ఆమె కెరియర్ పై ఈ రూమర్ పెద్ద ప్రభావం చూపెడుతుంది.ఇలాంటి రూమర్ల వల్ల ప్రియా కెరియర్ నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. అలాగే ఆమె కెరియర్ పై మరింత దృష్టి పెట్టి ఈ రూమర్లకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రియా నాకు టచ్ లో లేదు.ఆ విషయాలు నాకు తెలియదు అంటూ పార్థిబన్ చెప్పుకొచ్చారు. ఇక పార్థీబన్ మాటలతో ప్రియా నిజంగానే శ్రీకాంత్ అడ్డాలతో ఎఫైర్ పెట్టుకుందని,కానీ పరోక్షంగా శ్రీకాంత్ అడ్డరల విషయాన్ని బయట పెట్టకుండా ప్రియా కెరియర్ పై దృష్టి పెడితే బాగుంటుందని మాట్లాడినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఇన్ని రోజులు పేర్లు బయటికి రాకుండా ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి.కానీ తాజాగా డైరెక్టర్ హీరోయిన్ పేర్లతో సహా తమిళ మీడియాలో తెలుగు మీడియాలో వార్తలు రావడంతో వీరి కెరియర్లపై ఈ రూమర్లు ఎఫెక్ట్ చూపిస్తాయని సినీ క్రిటిక్స్ అనుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: