
తాజాగా మళ్లీ సోనీయా ఆకుల నాగార్జున హోస్టింగ్ మీద మాట్లాడుతూ .. నాగార్జున గారు ఉంటే తాను బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళనని తేల్చి చెప్పింది.ఆయన కేవలం చెవిలో బిగ్ బాస్ టీమ్ చెప్పిన వ్యాఖ్యలను మాత్రమే మాట్లాడుతారని తన విషయంలో అడల్ట్రేటెడ్ అన్న వ్యాఖ్యలు చాలా పెద్దవిగా చూశారంటూ తెలియజేసింది. హోస్ట్ అందరూ చెప్పేది విని కొంత సమయం తీసుకుని అయినా సొంతంగా చెప్పాల్సి ఉంటుంది అంటూ తెలిపింది.. నాగార్జున పోస్టింగ్ కంటే తన దృష్టిలో రానా హోస్టింగే బెస్ట్ అంటూ తెలియజేసింది సోనియా ఆకుల.
ప్రస్తుతం ఉన్న జనరేషన్ విషయాలను రానాకి బాగా తెలుసు కాబట్టి హోస్ట్ గా రానా చేస్తేనే బిగ్ బాస్ కి మళ్ళీ వెళతానని తెలియజేసింది సోనీయా ఆకుల. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ అందరూ కూడా హోస్ట్ కి సమానంగానే ఉంటారని ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చూసి అవకాశం ఎక్కడ ఉందంట ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున గత మూడవ సీజన్ నుంచి హోస్టుగానే ఉన్నారు అలాంటిది ఆయనని ఎప్పుడు తప్పు పడతావ సోనియా అంటూ అక్కినేని ఫ్యాన్సీ సైతం ఫైర్ అవుతున్నారు. మొత్తానికి నాగార్జున మీద చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.