టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తారు. ఇక మరి కొంతమంది అందం, నటన ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతారు. అలాంటి వారిలో నటి శాలిని పాండే ఒకరు. ఈ చిన్నది అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో తనదైన నటన, అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఈ సినిమాలో నటించిన అనంతరం ఈ చిన్న దానికి తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వస్తాయని అభిమానులు అంతా అనుకున్నారు.



కానీ ఎలాంటి సినిమాలలో అవకాశాలు రాకపోగా ఈ చిన్నది తెలుగులో సినిమాలు కూడా చేయడం మానేసింది. కాగా శాలిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేసుకుంటూ తరచూ వార్తలో నిలుస్తూ ఉంటారు. శాలిని పాండే మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించారు. ఈమె తెలుగులో అర్జున్ రెడ్డి, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాలలో నటించింది. ఇటీవల "డబ్బా కార్టేల్" సిరీస్ లలో నటించారు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా చేసిన మహారాజ్ సినిమాలోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో ఈ చిన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


ఆ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో భాగంగానే యాంకర్ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలలో మళ్లీ నటిస్తారా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా శాలిని పాండే తన కెరీర్ బిగినింగ్ లో ఈ అవకాశం వచ్చిందని, అందులో తన పాత్ర కాస్త బలహీనంగా ఉంటుందని తెలియజేసింది. అలాంటి సినిమాలలో మళ్లీ నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పింది.


అయితే నటించే ముందు డైరెక్టర్ తో మాట్లాడి కొన్ని మార్పులు తప్పకుండా చేయించుకుంటానని వెల్లడించింది. సినిమాలలో బలమైన క్యారెక్టర్లు చేయాలనేది నా కోరిక. ఆ కోరిక డబ్బా కార్టేల్ సిరీస్ తో తీరినట్లుగా చెప్పింది. ఇక సినిమాలలో అవకాశాలు వస్తే తన తన పాత్ర బలంగా ఉంటే తప్పకుండా చేస్తానని వెల్లడించింది. అంతేకాకుండా నా క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి సీన్లలోనైనా నటించడానికి ఒప్పుకుంటానని శాలిని పాండే వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిన్నది మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: