ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా మొదటి మరియు రెండవ భాగంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో కనిపించాడు. స్మగ్లర్ పాత్రలో నటించిన వ్యక్తి కి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏమిటి అని అల్లు అర్జున్ కి పుష్ప సినిమాకు గాను నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా పెద్ద లెవెల్ లో అనేక మంది గట్టిగా స్పందించారు. ఇకపోతే తాజాగా పుష్ప సినిమా ఎఫెక్ట్ మరో విషయంలో కూడా గట్టిగా బయటపడింది. అసలు విషయం లోకి వెళితే ... పుష్ప పార్ట్ 2 సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే పుష్ప ను పట్టుకోవాలి అని ఆ మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన బన్వర్షన్ షికావత్ ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఆ సమయంలో పుష్ప దమ్ముంటే పట్టుకోరా షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే డైలాగ్ కొడతాడు. ఈ డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇకపోతే తాజాగా శ్రీకాకుళం జిల్లా , టెక్కలి లో ఓ ఎగ్జామ్ సెంటర్ గోడ పైన దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు ... పట్టుకుంటే వదిలేస్తా బుక్ లేటు ... నీ అవ్వ తగ్గేదిలే అంటూ రాసుకోచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ సంఘటన వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: