నాగచైతన్య శోభితల పెళ్లి తర్వాత చాలా వరకు సోషల్ మీడియాలో వీరి గురించే ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా పనిగట్టుకొని మరీ కొంతమంది వీళ్ళని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.కానీ వీళ్ళు మాత్రం ఆ రూమర్లపై,ట్రోల్స్ పై స్పందించకుండా తమ హ్యాపీ లైఫ్ ని తాము లీడ్ చేస్తున్నారు. అయితే తాజాగా నాగచైతన్య శోభితలకు సంబంధించి ఒక షాకింగ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటోలో నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల కాళ్ల దగ్గర కూర్చోవడంతో నాగచైతన్య పరువు పాయె అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ శోభిత కాళ్ల దగ్గర నాగచైతన్య ఎందుకు కూర్చున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. శోభిత నాగచైతన్య రీసెంట్ గానే హనీమూన్ కి వెళ్లి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. 

హనీమూన్ కి వెళ్ళిన ఫోటోలను కూడా నాగచైతన్య శోభితలు సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్య శోభిత  ధూళిపాళ్ల కు సంబంధించి ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. శోభిత సోఫాలో కూర్చుంటే నాగచైతన్య మాత్రం శోభిత కాళ్ల దగ్గర కింద కూర్చున్నారు. అయితే ఈ ఫోటో ఒక మ్యాగజిన్ కి ఇచ్చిన స్టిల్.. ఓగ్ అనే మ్యాగజిన్ కి నాగచైతన్య శోభితలు స్టిల్ ఇవ్వగా ప్రస్తుతం ఆ మ్యాగజైన్ కి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ ఫోటోలో నాగచైతన్య శోభిత కాళ్ల దగ్గర కూర్చొని శోభిత కాళ్ల మీద చేయి వేశారు. ఇక మరో ఫోటోలో శోభిత నాగచైతన్య ఇద్దరు రొమాంటిక్ హాగ్  ఇచ్చుకున్నారు.

అయితే ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారడంతో పాటు ఈ మ్యాగజిన్ కి నాగచైతన్య శోభిత ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ..అందరిలాగే మా ఇంట్లో కూడా మేము సరదాగా ఉంటాం అనుకుంటారు. మీరు అందరూ అనుకుంటున్నట్లు ఇంట్లో మా లైఫ్ హ్యాపీగా ఉంటుందని భావిస్తారు. కానీ మేము సాదాసీదా జీవితాన్ని అనుభవిస్తాం. సమయం దొరికితే చాలు తిండి కూడా తినకుండా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటాం అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: