ఏంటి నేచురల్ స్టార్ నాని అందులో గే నా.. ఇది నిజమేనా.. ఎందుకు నాని అలాంటి పని చేస్తున్నారు..సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. నాని గే అంటూ వస్తున్న వార్తల్లో ఉన్న నిజం ఏంటంటే.. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో పారడైజ్ అనే మూవీలో చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ టీజర్ లో నాని బూతులతో రెచ్చిపోయారు. అంతేకాదు ఈ సినిమాలో నాని క్యారెక్టర్ తో పాటు వేషధారణ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. రెండు జడలు వేసుకొని రక్తంతో తడిసిపోయి తన చేతిపై లం** కొడుకు అని పచ్చబొట్టుతో, ముక్కుకు ముక్కు పుడక పెట్టుకొని చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. 

ఇక నానికి సంబంధించి పారడైజ్ మూవీలోని లుక్ చూస్తేనే చాలామందికి సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో నాని ఏ పాత్రలో నటిస్తున్నారు. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి వేళ తాజాగా సోషల్ మీడియాలో నాని ది పారడైజ్ మూవీ గురించి ఒక షాకింగ్ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే..పారడైజ్ మూవీలో నాని గే పాత్రలో నటించబోతున్నారని, అందుకే పారడైజ్ గ్లింప్స్ లో రెండు జడలు వేసుకొని ముక్కుకి ముక్కుపుడక పెట్టుకున్నాడని టాక్.

అయితే సినిమా మొత్తం ట్రాన్స్ జెండర్ గా నటించకుండా కేవలం ఒకే ఒక్క సీన్ కోసం ఇలా ట్రాన్స్ జెండర్ అవతారం ఎత్తుతారని ఆ సీన్ భారీ యాక్షన్ తో కూడి ఉందని,అందుకోసమే శ్రీకాంత్ ఓదెల ఆ సీన్ కోసం నానితో ట్రాన్స్ జెండర్ అవతారం ఎత్తించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పారడైజ్  మూవీ నుండి విడుదలైన గ్లింప్స్ లో నాని అలాంటి వేషధారణలోనే కనిపించారు. మరి నిజంగానే నాని ది పారడైజ్ మూవీలో ట్రాన్స్ జండర్ గా కనిపించబోతున్నారా.. లేక సోషల్ మీడియాలో వినిపించేవన్ని రూమర్ లేనా అనేది తెలియాల్సి ఉంది.ఇక రీసెంట్ గానే నాని నిర్మాతగా చేసిన కోర్టు మూవీ భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడంతో చిత్ర యూనిట్ తో పాటు నాని కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: