
చిరంజీవి పేరు మీద ఇప్పటికే చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. ఇప్పుడు తాజాగా మరొక అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకున్నట్లు తెలుస్తోంది.. యూకే పార్లమెంటులో గౌరవ సత్కారం అందుకున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి సమాజ సేవకు అందించిన సేవలకు గాను యూకే చెందిన పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం నిన్నటి రోజున చాలా గ్రాండ్గా జరిగినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
పలువురు పార్లమెంట్ సభ్యులు చిరంజీవిని వేదిక పైన చాలా గ్రాండ్గా సత్కరించినట్లు తెలుస్తోంది. చిరంజీవి చేసిన కృషికి గుర్తించి కల్చర్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవ చేసినందుకు కాను జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. అందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో అభిమానులు తెగ సంబరపడిపోతూ ఈ వీడియోను వైరల్ గా చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని అభిమానులు తెలియజేస్తున్నారు.