
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ బాగానే హైప్ తీసుకోవచ్చాయి. తాజాగా ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది .ట్రైలర్ చూస్తూ ఉంటే స్టీఫెన్ నేడుంపల్లి మళ్లీ ఖురేషి అబ్రహంగా ఎందుకు మారిపోయారు? అలా ఎలా మారాడు? ప్రపంచంలో ఎన్నో దేశాలు అతని కోసం వెతుకుతున్నాయి? తన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలా వచ్చారు అనే కదాంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ట్రైలర్లో మేకింగ్ అంతా చూస్తూ ఉంటే అద్భుతంగా ఉందని మోహన్ లాల్ ఇస్ బ్యాక్ అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. నా బిడ్డలు కాదు నన్ను ఫాలో అయ్యేది.. నన్ను ఫాలో అయిన వారు ఎవరో వారే నా బిడ్డలు అన్నట్టుగా చూపించారు.. ఇక ఇందులో రాజకీయంగా కూడా మరిన్ని అంశాలను చాలా అద్భుతంగా తెరకెక్కించారు పృథ్వీరాజ్ సుకుమారన్ . మోహన్ లాల్ ను చూపించిన తీరు కూడా హైలెట్గా ఉన్నది. మరి ట్రైలర్ తోనే హైప్ తీసుకు వస్తున్న L2E ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే 27వ తేదీ వరకు ఉండాల్సిందే.ఈ చిత్రంలో మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ ,టోవినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్ , సానియా అయ్యప్ప తదితరు నటీనటులు సైతం నటించారు.