విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా అంజలి , సమంత హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ప్రకాష్ రాజ్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... రావు రమేష్మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా అంజలి నటించగా ... మహేష్ బాబుకు జోడిగా సమంత నటించింది. ఈ మూవీ ని 2013 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ ని పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వచ్చాయి. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 40 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 5.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి ఈ మూవీ కి 60 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 60 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ లో భాగంగా 6.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇలా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: