యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తారక్ హిందీ సినిమా అయినటువంటి వార్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి డ్రాగన్ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లు , ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ను మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ తాజాగా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ను శ్రీలంకలో ప్లాన్ చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే షెడ్యూల్ లో పాల్గొనే నటీ నటులు , అలాగే అనేక మంది టెక్నీషియన్స్ శ్రీలంకకు బయలు దేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ , ప్రశాంత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి తారక్మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే ఇంక చాలా కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: