తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ ఈ మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడం , మార్క్ ఆంటోనీ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన అధిక రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమాని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఏప్రిల్ 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యం లో ఈ మూవీ బృందం వారు ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన యు ఎస్ ఎ బుకింగ్స్ ను మార్చ్ 21 వ తేదీన అనగా శుక్రవారం రోజున ఓపెన్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో అజిత్ కుమార్ నటించిన ఏ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అజిత్ ఏ స్థాయికి అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak