తమిళ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాల లో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . అలాగే ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి . అందులో కొన్ని మూవీలు మంచి విజయాలను కూడా సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. ఇకపోతే చాలా సంవత్సరాలుగా సూర్య నేరుగా ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నాడు అని వార్తలు వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

అందులో భాగంగా అనేక మంది దర్శకుల పేర్లు కూడా తెరక్పైకి వచ్చాయి. ప్రస్తుతం సూర్య టాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో వెంకీ అట్లూరి వరుస పెట్టి ఇతర ఇండస్ట్రీ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈయన తమిళ నటుడు అయినటువంటి ధనుష్ హీరోగా సార్ అనే మూవీ ని రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు. కొంత కాలం క్రితమే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి సూర్య తో చేయబోతున్నట్లు , అందులో భాగంగా ప్రస్తుతం సూర్య సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈయన బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సూర్య హీరోగా రూపొందబోయే సినిమాలో వెంకీ అట్లూరి , మమత బైజు ను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: