మన తెలుగు లో సునీల్ గొప్ప హాస్య నటుడు .. కెరియర్ మొదట లో ఆయన చేసిన కామెడీ అందర్నీ ఎంతగానో కడుపుబ్బ నవ్వించేది .. ఆ తర్వాత హీరో గా సినిమాలు చేశాడు .. అలా హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత కేవలం కమెడియన్ గానే కాకుండా క్యారెక్టర్ బలం ఉంటే ఎలాంటి పాత్రలైనా చేశారు .. కలర్ ఫోటో , పుష్ప , మహావీరుడు  సునీల్ గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలబెట్టిన సినిమాలు . అయితే ఇప్పుడు మరో నూటడు సప్తగిరి కూడా సునీల్ లాంటి గ్రాఫ్ ని కోరుకుంటున్నారు .. కామెడీ పాత్రలు చాలా చేశాను.


మళ్లీ అదే టైమింగ్ రైమింగ్ ఉండే పాత్రలు చేయడంలో నాకు కిక్కు దొరకటం లేదు సునీల్ అన్నలా మంచి క్యారెక్టర్ బలం ఉండే సినిమా ల్లో చేయాలని ఉంది .. నటుడి గా నాలో ఆ సత్తా ఉంది కథ లో బలమైన పాత్రలని చేయగలనని నమ్మకం నాలో ఉంది .  అందుకే ఈ రీసెంట్‌ టైమ్స్ లో ఒకే తరహాలో ఉండే కామెడీ పాత్ర లు చేయడం లేదు .. కమెడియన్గా తాను ఏంటో ప్రూవ్ చేసుకున్నాను ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బలం వున్న పాత్రలో తానేంటో నిరూపించుకోవాలని ఉంది అని తన మనసులో మాటను బయటపెట్టాడు సప్తగిరి ..


ఇదే క్రమంలో సప్తగిరి హీరోగా నటించిన పెళ్లికాని ప్రసాద్ సినిమా మార్చ్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఇక ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేయడం మరో విశేషం .  అలాగే సప్తగిరి , అనిల్ రావుపూడి మంచి ఫ్రెండ్స్ అనిల్ కారణంగా ఈ సినిమా నిర్మాత శిరీష్ వద్దకు  వెళ్ళింది కామెడీ సినిమా కావటంతో సమ్మర్లో ప్రేక్షకులు బాగా చూస్తారని ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది . సప్తగిరి కోరుకున్నట్టు రాబోయే రోజుల్లో  సునీల్ లాంటి క్యారెక్టర్లు అందుకుంటారు లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: