తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను నిర్మించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినీ పరిశ్రమలో టాప్ నిర్మాతలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈయన నిర్మాతగా కెరియర్ను ప్రారంభించినప్పటి నుండి చాలా కాలం వరకు ఎక్కువ శాతం తెలుగు దర్శకులతో సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇకపోతే ఈయన ఈ మధ్య కాలంలో మాత్రం ఇతర భాష దర్శకులతో సినిమాలను చేయడంలో అత్యంత ఆసక్తిని చూపిస్తున్నాడు.

తాజాగా ఈ దర్శకుడు రామ్ చరణ్ హీరో గా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ అనే మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయింది. ఇక అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కూడా దిల్ రాజు ఓ మూవీ ని రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఓ మలయాళ దర్శకుడితో కూడా దిల్ రాజు ఆ మూవీ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కొన్ని రోజుల క్రితం మలయాళం లో మార్కో అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి అనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ దర్శకుడి దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా చేయబోతున్నట్లు , ఇక ఈ సినిమా ఏకంగా భారీ మల్టీస్టారర్ మూవీ గా ఉండబోతున్నట్లు , ఈ మూవీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉన్నది అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: