కోలీవుడ్లో దళపతి విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో .. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని సిచువేషన్ కనిపిస్తుంది .. ప్రస్తుతం తమిళ‌ ఇండస్ట్రీలో విజయ్‌ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు .. రజనీకాంత్, కమలహాసన్ టాప్ ప్లేస్ లోనే ఉన్న . ప్రజెంట్ వాళ్లు సీనియర్స్ అన్న ట్యాగ్ తో పక్కకు వెళ్లిపోయారు .. దీంతో విజయ్ , అజిత్ మధ్య ఇన్నాళ్లు భారీ ఫైట్ నడిచింది .. ఈ పోటీలో విజయ్ ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉన్నాడు .  అయితే ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడు అంటూ ప్రకటించడంతో సీను ఒక్కసారిగా మారిపోయింది .. విజయ్ పక్కకు వెళ్లిపోతే నెక్స్ట్ ఆ ప్లేస్ లో ఉన్న అజిత్ నెంబర్ వన్ అవుతారని అంతా అనుకున్నాను .. కానీ అజిత్ కూడా సినిమాలు విషయంలో పెద్దగా ఇంట్రస్ట్ చూపటం లేదని చెప్పేశారు ..


ఈ రీసెంట్ టైమ్స్ లో సినిమాలు కన్నా ఎక్కువ రేస్ ట్రాక్ల మీదే ఈ హీరో కనిపిస్తున్నాడు .. రేసింగ్ మధ్యలో గ్యాప్ ఉంటేనే సినిమాలు చేస్తా అంటున్నాడు .. ఇక దీంతో అజిత్ కూడా నెంబర్ వన్ రెస్‌ లో లేరని  తేలిపోయింది. రజినీ , కమల్ వరుసగా సినిమాలు చేస్తున్న ప్రస్తుతం వాళ్ల నెంబర్ వన్ రేస్ లో తీసుకొని అవకాశం లేదు .. ఇప్పటికే ఈ స్థానంలో కొన్ని దశాబ్దాల పాటు రూల్ చేసి యంగ్ హీరోలకు అప్పగించారు రజినీ , కమల్ .. ఇక ఇప్పుడు విజయ్ , అజిత్ కూడా పక్కకు వెళ్లిపోవడం తో నెక్స్ట్ ఎవరు అన్నది ఇప్పుడు ఎంతో ఆసక్తిగా మారింది .. సూర్య , విక్రమ్ లాంటి హీరోలు వ‌రుస‌ సినిమాలతో వస్తున్న వాళ్ల సక్సెస్ రేట్ సరిగ్గా లేకపోవడంతో వాళ్ళ పేర్లు నెంబర్ వన్ రేస్ లో కనిపించడం లేదు .. ఈ ఏడాది రాబోయే సినిమాలతో ఈ ఇద్దరు ఫామ్ లోకి వస్తే మళ్లీ నెంబర్ వన్ గేమ్ మొదలయ్యే అవకాశం ఉంది.


వరుస ఫెయిల్యూర్ తో ఇబ్బందుల్లో ఉన్న సూర్య కోవిడ్ టైంలో డిజిటల్ రిలీజ్ తో గట్టి సత్తా చాటారు .. అయితే ఆ తర్వాత థియేటర్ రిలీజ్ లోను అదే జోరు చూపిస్తారని అంతా అనుకున్న అది సెట్ కాలేదు .. భారీ అంచనాలతో రిలీజ్ అయిన కంగువ డిజాస్టర్ గా మిగిలిపోవటంతో మరోసారి తమిళ జనాలు ఆలోచనలో పడ్డారు .. ఇక విక్రమ్‌ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది .. విక్రమ్ సక్సెస్ చూసి చాలా సంవత్సరాలవుతుంది .. వరుసగా ప్రయోగాలు చేస్తున్న విజయం మాత్రం అందుకోలేకపోతున్నారు .  శివకార్తికేయన్ లాంటి హీరోలు మంచి సక్సెస్ అందుకుంటున్న ఇప్పుడే నెంబర్ వన్ హీరో అన్న రేంజ్ ట్యాగ్ ఇచ్చి పరిస్థితి కనిపించడం లేదు .. అయితే ఇప్పుడు మరో కొంతకాలం కోలీవుడ్ లో నెంబర్ వన్ పీఠం ఖాళీగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: