
సూర్య - త్రిష ఇద్దరు ఈ సినిమాలో న్యాయవాదులుగా కనిపించబోతున్నారు . ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ఆర్జే బాలాజీ ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. సినిమా తర్వాత సూర్య మరో కోలీవుడ్ సినిమా వాడివాసల్ లో నటించబోతున్న విషయం తెలిసిందే .. వీటితో పాటు లక్కీ భాస్కర్ , సార్ లాంటి బ్లాక్బస్టర్ సినిమాలు తెర్కక్కించిన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఓకే చేశాడు సూర్య .. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుందని కూడా అంటున్నారు .. ఇప్పటికే ఈ సినిమా గురించి కోలీవుడ్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది . ఇంకా అనౌన్స్ కానీ ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పుడు ఓ వార్త బయటకు వచ్చింది .
ఈ సినిమాలో హీరోయిన్ మమిత బైజు కూడా ఓ ప్రధాన పాత్రలో నటించబోతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది .. ఇక గతంలో వీరిద్దరూ దర్శకుడు బాల డైరెక్షన్ చేసిన వనంగాన్ సినిమాలో నటించారు .. కానీ ఆ సినిమా నుంచి కొన్ని అనుకోని కారణాలతో సూర్య , మమిత ఇద్దరూ తప్పుకున్నారు .. ఆ తర్వాత అరుణ్ విజయ్ , రీత నటించారని చెబుతారు .. ఈ క్రమంలనే దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించబోయే సినిమాలో హీరోయిన్ మమితా బైజు కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారని వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి .. అలాగే త్వరలోనే దీనిపై అధికార ప్రకటన కూడా రానుంది .. ఇటీవలే ధనుష్ హీరోగా వస్తున్న ఓ సినిమాలో కూడా ఈ బ్యూటీ మంచి అవకాశం కొట్టేసింది .