మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు తమ నటనతో అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం నాలుగు, ఐదు సినిమా లకె పరిమితం అవుతూ ఉంటారు .కొంతమంది ఇతర రంగాల్లో బిజీ అవుతూ ఉంటారు. వారి లో ఈ ముద్దుగుమ్మ ఒకటి. హీరోయిన్‌ గా అవకాశాలు రావడమే కాదు. అదృష్టం కూడా కలిసి రావాలి. చాలామంది హీరోయిన్స్ నటన మీద ఆసక్తితో హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కొంతమంది హీరోయిన్స్ సక్సెస్ అయితే కొంతమంది సక్సెస్ లేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని సినిమాల కె పరిమితం అవుతూ ఉంటారు. తమకు ఎంత అందం  ఉన్నా అవకాశాలు లేక కొత్త కొత్త హీరోయిన్స్ వరుస‌ సినిమాల్లో న‌టిస్తుంటే ..


కొంతమంది ముద్దుగుమ్మలు హిట్ కొట్టడానికి కాకుండా అవకాశాలు అందుకోవడానికి కూడా కష్టపడుతూ ఉంటారు. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న భామ కూడా ఇదే కేటగిరిలోనికి వస్తుంది. అందం, అభినయం ఉన్న‌ కూడా అవకాశాలు లేక సైలెంట్ అయింది. ఆమె నటి మాత్రమే కాదు లాయర్ కూడా ఈమె ఎవరో గుర్తుపట్టారా..? పై ఫోటోలో ఉన్న ఈ ముద్దుగుమ్మ నటి మాత్రమే కాదు న్యాయవాది కూడా.. ఈమె ఎవరో కాదు హాట్ బ్యూటీ 'మాళవిక శర్మ'ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు తక్కువే కానీ ప్రేక్షకులను మాత్రం తన అందాలతో కట్టిపడేస్తుంది. మోడలింగ్ తో కెరియర్ మొదలుపెట్టిన ఈ చిన్నది ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ ముద్దుగుమ్మ రిజ్వీ లా కాలేజీ నుంచి క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీ తో  పట్టా అందుకుంది. హీరోయిన్ గానే కాకుండా న్యాయవాది వృత్తిని కూడా కొనసాగిస్తుంది.


రవితేజ హీరోగా నటించిన 'నేల టికెట్ 'సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ తన అందంతో అందరిని కట్టిపడేసింది కొన్నేళ్ల తర్వాత రామ్ నటించిన 'రెడ్' సినిమాలో నటించింది .కానీ ఈ సినిమా కూడా అంతగా రాణించలేదు. సుధీర్ బాబుతో 'హరోం హర 'గోపీచంద్ తో  భీమా' సినిమా చేసింది. ఈ భామకు మాత్రం ఈ నాలుగు సినిమాలు ఫ్లాప్ లే తెచ్చిపెట్టాయి. దాంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడమే మానేసాయి. ఇప్పుడు లాయర్ వృత్తిని చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కొనసాగుతుంది .రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ..!!



మరింత సమాచారం తెలుసుకోండి: