
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి శ్రియ శరణ్ ఒకరు. ఈ చిన్నది టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మొదటి సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో అందంగా సాంప్రదాయంగా కనిపించే శ్రియ అచ్చ తెలుగు అమ్మాయిల ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. నేనున్నాను, నువ్వే నువ్వే వంటి సినిమాలలో ఈ బ్యూటీ నటించి విపరీతంగా గుర్తింపు అందుకుంది. శ్రియకి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.
దాదాపు ఈ చిన్నది స్టార్ హీరోలు అందరితో జతకట్టింది. ఇప్పటికీ శ్రియా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును అందుకుంటుంది. ఈ బ్యూటీ వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ తన హవాను కొనసాగిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ చిన్నది తన కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయినప్పటికీ ఏమాత్రం ఆపకుండా ఇప్పటికే సినిమాలు చేసుకుంటూ తన హవాను కొనసాగిస్తూనే ఉంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ అభిమానులకు చేరువలో ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది.
ఇదిలా ఉండగా... ప్రస్తుతం ఈ చిన్నదానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. శ్రియ ప్రెగ్నెంట్ అని ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. శ్రియ తన రెండవ బిడ్డను కనడానికి సిద్ధమైందని ప్రస్తుతం శ్రియ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ విషయం పైన శ్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి.