స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం అఖండ2 సినిమాతో బిజీగా ఉన్నారు.
 
అయితే బాలయ్య సినీ కెరీర్ లో ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమా లేదనే సంగతి తెలిసిందే. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే బాలయ్యకు భారీ హిట్లు దక్కే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. లుక్స్ విషయంలో సైతం బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
సినిమా సినిమాకు కెరీర్ పరంగా ఎదుగుతున్న బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. లక్ కలిసొస్తే బాలయ్య మరిన్ని సంచలన రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బాలయ్యకు పాన్ ఇండియా ఇమేజ్ దక్కితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. బాలయ్య సైతం కెరీర్ పరంగా ఎదగడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
 
బాలయ్య వయస్సు 64 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా బాలయ్య పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేసే కథలకు ఓకే చెబుతున్నారు. రెమ్యునరేషన్ పరంగా కూడా బాలయ్య ఎదుగుతున్నారు. బాలయ్య పారితోషికం ఏకంగా 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఇతర భాషల్లో సైతం బాలయ్య సత్తా చాటితే అభిమానులు ఎంతో సంతోషిస్తారని చెప్పవచ్చు. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: