బలగం వేణు..ఈ పేరు చెబితేనే చాలామందికి ఇష్టమైన డైరెక్టర్ పేరుగా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షో తో కమెడియన్ గా పలు హీరోల సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు, గుర్తింపు లేని పాత్రలు చేసిన జబర్దస్త్ వేణు బలగం సినిమా తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా బలగం డైరెక్టర్ వేణు అంటే తెలియని వారు ఉండరు. బలగం సినిమాను తెరకెక్కించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. దాదాపు 100కు పైగా అవార్డులను అందుకొని బలగం సినిమా సత్తా చాటింది. అయితే అలాంటి బలగం సినిమా తర్వాత వేణు నెక్స్ట్ ఎల్లమ్మ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే ఎల్లమ్మ సినిమాకి సంబంధించి ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇక బలగం సినిమా ఎలా అయితే నేచురల్ గా ఉందో ఎల్లమ్మ సినిమాని కూడా అలాగే నాచురల్ గా తెరకెక్కించి మరోసారి హిట్ కొట్టాలి అని వేణు యెల్దండి చూస్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరోగా నితిన్ హీరోయిన్ గా సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్టు సినీ వర్గాల్లో వార్తలు కూడా వినిపించాయి.అయితే ఇందులో హీరో కంటే ఎక్కువగా హీరోయిన్ కే ప్రాధాన్యత ఉంటుందని,అందుకే మంచి హీరోయిన్ ని తీసుకోవాలి అని చూసి సాయి పల్లవిని ఫిక్స్ చేశారట. కానీ తాజాగా సాయి పల్లవి ఎల్లమ్మ మూవీ నుండి తప్పుకున్నట్టు టాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్లో రామాయణం మూవీ లో చేస్తుంది.ఇక రామాయణం మూవీ కాకుండా బాలీవుడ్లో మరో సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తుంది.

అలాగే తమిళంలో కూడా సాయి పల్లవి రెండు సినిమాలకు ఓకే చెప్పిందట. ఈ నేపథ్యంలోనే ఎల్లమ్మ సినిమాకి ముందుగా ఒప్పుకున్న సినిమాలకి మధ్య డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కాల్షీట్లు లేవని వేణు యెల్దండి ఎల్లమ్మ మూవీ నుండి తప్పుకున్నట్టు తెలియజేసిందట. అయితే ఎల్లమ్మ మూవీ నుండి సాయిపల్లవి నిజంగానే తప్పకుందా లేక ఇది సోషల్ మీడియాలో వినిపించే రూమరా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.ఒకవేళ సాయి పల్లవి తప్పకుంటే గనుక హీరోయిన్ ప్రాధాన్యత ఉండే సినిమా కాబట్టి ఇందులో మళ్లీ స్టార్ హీరోయిన్ నే పెట్టుకోవాలి. ఒకవేళ సాయి పల్లవి తప్పుకుంటే గనుక బలగం వేణుకి హీరోయిన్ ని వెతుక్కోవడం మళ్ళీ కష్టం అయ్యే పనే

మరింత సమాచారం తెలుసుకోండి: