
ఈవారం విడుదలకాబోతున్న చిన్న సినిమాలలో ‘పెళ్ళికాని ప్రసాద్’ అంచనాలకు అనుగుణంగా ముందు వరసలో ఉంది. ఈ మూవీ కంటెంట్ పై కమెడియన్ హీరో సప్తగిరికి ఉన్న నమ్మకంతో ఏకంగా విడుదలకు ముందు ప్రీమియర్ షోలు కూడ వేశారు. వెంకటేష్ నటించిన ‘మల్లేశ్వరి’ మూవీలోని ‘పెళ్ళికాని ప్రసాద్’ ట్యాగ్ లైన్ ను తన టైటిల్ గా మార్చుకునీ ఈవారం సప్తగిరి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
గత కొన్ని సంవత్సరాలుగా హిట్ అన్న పదం సప్తగిరి కాంపౌండ్ లో వినిపించడంలేదు. అదే బాటలో ఆది సాయి కుమార్ కూడ పయనిస్తున్నాడు. అతడు హీరోగా నటించిన షణ్ముఖ మూవీ కూడ ఈ వారమే విడుదల కాబోతోంది. ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ పై ప్రస్తుతానికి పెద్దగా అంచనాలు లేవు. ఈ మూవీ పబ్లిసిటీని కూడ అంతంత మాత్రంగానే చేశారు.
హీరో ఆదీకి కూడ ఒక హిట్ కావాలి. ప్రస్తుతానికి అంచనాలను పరిగణలోకి తీసుకుంటే పెళ్ళికాని ప్రసాద్ పైనే క్రేజ్ కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు రోషన్ ప్రధాన పాత్ర పోషించిన ‘టుక్ టుక్’ విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ‘అనగనగా ఆస్ట్రేలియా బాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘కిస్ కిస్ కిసిక్’ ఈవారమే విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు ‘ఎవడే సుభ్రమణ్యం’ ప్రభాస్ ‘సలార్’ రీ రిలీజ్ అవుతున్న సందర్బంలో ఈవారం విజేత ఎవరు అన్న ఆశక్తి చాల మందిలో ఉంది..